![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1081 లో.... రాజుని ఇంటికి పిలిపించమని ఇందుతో అపర్ణ అనగానే అతను ఈ ఇంటికి ఏమవుతాడు అతన్ని ప్రాబ్లమ్ లో నెట్టడం ఎందుకని ఇందు అంటుంది. అతను నీ భర్త అని అపర్ణ అంటుంది. ఇందు సైలెంట్ గా వెళ్ళిపోతుంది. నానమ్మ నేను వచ్చాను కదా అంతా నేను చూసుకుంటానని నందు చెప్తుంది. మరొకవైపు రేఖకి రాజు ఫోన్ చేస్తాడు. ఎలా ఉంది పిన్ని ట్విస్ట్ అని రాజు అడుగుతాడు. నేను ఉండగా ఆస్తులు మీ చేతికి రానివ్వనని రాజు అంటాడు.
ఇప్పుడే కాదు ఎప్పుడు ఇందుకి నేనే భర్తను అని చెప్తూ రేఖకి రాజు మాస్ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత శేషు బట్టలు సర్దుకొని వస్తాడు. భ్రమరాంబ మనం వెళ్ళిపోదాం.. ఆస్తులు వస్తాయేమో.. మనకి లాభం వస్తుందేమోనని వెయిట్ చేసాం కానీ అది జరిగేలా లేదు ఇందులాగా నందు సాఫ్ట్ కాదు చిన్నప్పటి నుండి పగని మోసుకుంటూ వచ్చిందని శేషు అంటాడు. అన్నయ్య మీరు కాసేపు సైలెంట్ గా ఉండండి.. ఆ నందు గురించి ఇన్ని రోజులు పట్టించుకోలేదు కానీ ఇక దాని సంగతి చెప్తానని రేఖ అంటుంది. దాంతో శేషు లోపలికి వెళ్తాడు.మరొకవైపు లక్కీ, రాజు డ్రింక్ చేస్తారు. నువ్వు చాలా లక్కీ రా పేరెంట్స్ ఉన్నారు కానీ నాకు అమ్మ ఎవరో నాన్న ఎవరో తెలియదు.. అమ్మ ప్రేమ ఎలా ఉంటందో తెలియదు.. అమ్మ గురించి తెలిసిన ఏకైక వ్యక్తి అంటోని గాడు.. వాడు నా వీక్ నెస్ క్యాచ్ చేసుకొని తన పనులు చేయించుకుంటున్నాడు తప్ప అసలు విషయం చెప్పట్లేదని లక్కీ ఎమోషనల్ అవుతాడు. బాధపడకు రా అని రాజు అంటాడు.
మరొకవైపు ఇందు గదిలోకి ఐశ్వర్య వస్తుంది. ఇప్పుడు రాజు లేడు కదా.. ఈ గదిలో నుంచి వెళ్ళిపోమని ఐశ్వర్య అనగానే అప్పుడే నందు వస్తుంది. మా అక్క వెళ్ళదని కోప్పడుతుంది. నందుకి ఐశ్వర్యకి గొడవ జరుగుతుంది. గొడవని ఇందు ఆపుతుంది. తరువాయి భాగంలో రాజుకు రేఖ ఆక్సిడెంట్ చేపిస్తుంది. ఇదంతా ఆ రేఖ చేయించింది రాజు దుగ్గిరాల వారసుడు అని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని ఇందుతో చలపతి అనగానే ఇందు షాక్ అవుతుంది. ఇందుకి చలపతి నిజం చెప్పేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |